విద్యార్థుల భవిష్యత్తుపై దాడి.టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి మే 12

*విద్యార్థుల భవిష్యత్తుపై దాడి*

*పరీక్షల పారదర్శకత* *కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు*

దేశవ్యాప్తంగా జరిగిన 2026 నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న దారుణ ఘటన. టి రామకృష్ణ మాట్లాడుతూ.రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై ఈ అవినీతి మాఫియా గుంపులు దాడి చేయడం అత్యంత ఖండనీయం.

ప్రభుత్వాల నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రైవేట్ కోచింగ్ మాఫియాలతో ఉన్న సంబంధాల వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలో పేపర్ లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై మరియు పేపర్ లీకేజీ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే పరీక్షను రద్దు చేసి, పూర్తి పారదర్శకతతో మళ్లీ నిర్వహించాలి.

విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విధానాల కారణంగానే విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షా వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టకుండా ప్రభుత్వమే బాధ్యతగా నిర్వహించాలి.

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, పరీక్షలలో అవినీతి అరికట్టాలని, ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) డిమాండ్ చేస్తోంది.

Latest articles

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 22 జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ...

విద్యార్థినులపై లైంగిక వేధింపులు..!

జనతా వార్ కామారెడ్డి జూలై 18 విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల పై వేటు .కామారెడ్డి జిల్లా బాన్సువాడ...

More like this

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 22 జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ...