కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను తక్షణం అమలు చేయాలి డి హెచ్ పి ఎస్

కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులు తక్షణం అమలు చేయాలి – డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్

రాజన్న సిరిసిల్ల: దళితులు మరియు భూమిలేని పేదల భూహక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు భూకమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా రెండు వ మహా సభల కు గుండ్రపల్లి రవీంద్ర అధ్యక్షతన సమావేశం శ్రామిక భవన్ లో బుధవారం సమావేశం జరిగింది. మహాసభల ప్రారంభ సూచికగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ జెండా ఆవిష్కరించారు. జిల్లా మహాసభలను ప్రారంభిస్తూ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, అసైన్ భూములు అన్యాయంగా ఇతరుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూకమిటీ స్పష్టంగా సూచించినట్లుగా భూముల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవడం, భూమిలేని దళిత కుటుంబాలకు సాగు భూమి పంపిణీ చేయడం అత్యవసరం అని పేర్కొన్నారు. అసైన్ భూముల ఆక్రమణలను వెంటనే తొలగించా లి భూమిలేని దళితులకు సాగుభూమి కేటాయించాలి.కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పూర్తిగా అమలు చేయాలిభూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేశారు.దళితుల జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన భూమితోనే సాధ్యమవుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధులు నిజంగా దళితులు, ఆదివాసుల అభివృద్ధికే ఖర్చవుతున్నాయా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం దళితులు, ఆదివాసుల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించి, ఆ వర్గాల విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహాలు, భూమి పంపిణీ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ అనేక శాఖలు ఈ నిధులను ఇతర పథకాల కింద చూపించడం లేదా ఖర్చు చేయకుండా నిల్వ చేయడం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన మొత్తం నిధులు, ఖర్చు చేసిన మొత్తం, మిగిలిన నిధులు మరియు అవి ఏ పథకాలపై ఖర్చు అయ్యాయన్న వివరాలతో కూడిన పూర్తి స్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.అలాగే సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లింపులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దళితులు మరియు ఆదివాసుల అభివృద్ధికి ఈ నిధులు పూర్తిగా వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. లేదంటే దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కదరి రాములు, పవిత్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...