విద్యా సంస్థల బందు విశేష స్పందన ఏఐఎస్ఎఫ్

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 10

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న విద్యాసంస్థలకు ఏఐఎస్ఎఫ్ అభినందనలు

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ బంద్‌లో పాల్గొనడం అభినందనీయమని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి అధ్యక్షుడు టి. నితీష్ ధర్మ తేజ అన్నారు.

విద్య హక్కును పరిరక్షించడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం తగ్గించడం, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విశేష సహకారం అందించారని తెలిపారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఈ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి విద్యాసంస్థ యాజమాన్యానికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఏఐఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం జరిగే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే విద్యా రంగ సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని టి. నితీష్ ధర్మ తేజ డిమాండ్ చేశారు.

– టి. నితీష్ ధర్మ తేజ

ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి అధ్యక్షుడు కార్యదర్శి

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this