రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15

ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

ఇజ్జత్‌నగర్ కాలనీలో రోడ్డు నిర్మాణం పేరుతో ఉన్న రహదారిని పూర్తిగా పగలగొట్టి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొత్త రోడ్డు వేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు ప్రజల ఇబ్బందులను పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. రోడ్డు పగలగొట్టిన తర్వాత పనులను మధ్యలోనే వదిలేయడంతో కాలనీవాసులు నిత్యం దుమ్ము, ధూళి, గుంతలు, డ్రైనేజీ మెన్ వాల్స్ పగిలిపోవడంతో డ్రైనేజీ రోడ్డుపై పారుతుంది భరించలేని దుర్వాసనతో దోమలు ఈగలు బురదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇంటి లోపలికి వెళ్లే పరిస్థితి లేక కనీసం 50 కుటుంబాలు రోడ్డు పాల్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అసలుకు అధికారులు ఉన్నారా మున్సిపల్ అధికారులు ఉన్నారా లేదా పాలకులు ఉన్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు

వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రమాదాలకు కారణమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల డబ్బుతో చేపట్టే పనుల్లో ఇలాంటి నిర్లక్ష్యం సహించరానిదని పేర్కొన్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అధికారుల కార్యాలయాల ముట్టడి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని టి. రామకృష్ణ హెచ్చరించారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this