సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మావోయిస్టు అగ్రనేతలు

జనతా వార్ హైదరాబాద్ మే 30

సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు

అటవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి మాజీ మావోయిస్టులను కమ్యూనిస్టులంతా మాతృ సంస్థ అయిన సిపిఐలో చేరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు. మాజీ మావోయిస్టులు దేవజీ(టిప్పిరి తిరుపతి),మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్‌), పుల్లూరి ప్రసాద్‌ రావు (చంద్రన్న) శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని మార్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సిపిఐ నేతలతో సమావేశమైయ్యారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కగార్‌ అపరేషన్‌కు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం, తదితర వామపక్షపార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేకమంది అనేక రూపాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అడవుల్లో ఉన్న మావోస్టులు ప్రాణాలు కాపాడబడాలని కోరుకున్నారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో ఏమి చేస్తారో తెలియని భయానక పరిస్థితుల్లో పాత్రికేయులు సహా అందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జన జీవన స్రవంతిలో కలిసి ఈ ముగ్గురు నేతలు కమ్యూనిస్టు పార్టీగా, కమ్యూనిజం పట్ల అభిమానం కలిగిన వారిగా సిపిఐ కార్యాలయానికీ రావాలనుకున్నారని, అయితే అప్పడు సమయం కుదరకపోవడంతో ఇప్పుడు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తమ కార్యాలయానికి వచ్చిన ఆ ముగ్గురుకి సిపిఐ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలపడం జరిందన్నారు. ప్రస్తుతం తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి, వారి భవిష్యత్తు ఏమిటి అనే దానిపై చర్చిస్తామని తమ ఆలోచనలను వారితో పంచుకుని, తెలంగాణకి, దేశానికి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. తద్వారా దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్‌ శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలబడగల శక్తి కమ్యూనిస్టు ఉద్యమానిదేనని అభిప్రాయపడ్డారు. త్వరలో అందరూ కలిసి మారిసారి సమావేశమై తమ రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారని కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేవ్‌జీ మాట్లాడుతూ సిపిఐ నేతలను తాము కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే వచ్చామని వెల్లడించారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....