బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

జనతా వార్. నిర్మల్ ఏప్రిల్ 6. బాసర. ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

బాసర సరస్వతి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడికి అక్షరాభ్యాసం

దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మ వారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ”225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం 20,వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ఉన్న బా సర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగు ల మేర విస్తరించనున్నా రు. కొత్త ఆలయ శిఖరాలు మండపాలు మాఢ వీధులు ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పార తో మట్టి తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబంతో కలిసి బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంప తులు తమ మనవడు రియాన్ష్​కు అక్షరాభ్యాసం చేయించారు.తరువాత బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయ విస్తరణ పనులను చేసేందుకు అధికారులు మాస్టర్‌ప్లాన్‌ రూపొందిం చారు. ఈ ప్లాన్‌లో ఆలయ పునరాభివృద్ధి నమూనా లోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే విడుదల చేసింది.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this