బిజెపికి 400 సీట్లు వచ్చి ఉంటే
రాజ్యాంగాన్ని ఈపాటికే తిరగ రాసేది ః పల్లా వెంకటరెడ్డి*
బిజెపి ఆశించినట్లుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈపాటికే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా తిరగా రాస్తేందుకు సకల ప్రయత్నాలు చేసి ఉండేదని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. మెజార్టీ రాకపోవడం వల్ల రాజ్యాంగ రక్షించబడుతోందని ఆయన పేర్కొన్నారు. సిపిఐ అధ్వర్యంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన పల్లా వెంకటరెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎస్.ఛాయాదేవి, నేదునూరి జ్యోతి, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రేమ్‌పాపని, పల్లె నర్సింహ్మా, రాపోలు సుదర్శన్, మారపాక అనిల్ కుమార్,ఎన్.శ్రీకాంత్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందపర్చిన ప్రజాస్వామ్యం,లౌకికత్వం, సమాఖ్య సూర్తికి తీలోదకాలు ఇచ్చి బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పరిపాలన కొనసాగించేందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు పూర్తిగా స్వేచ్చను కొల్పోయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవ్నరర్లు అందుకు భిన్నంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుయని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిగా పూర్తి విఘాతం కలిగిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సిపిఐ ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తోందని పల్లా వెంకటరెడ్డి గుర్తు చేశారు. మతోన్మాదమే ఏకైక ఎజెండగా బిజెపి పాలన కొనసాగిస్తుండడం గమనించాలని సూచించారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా నేటికి అంతరించిపోవాల్సిన పేదరికం అంతకు అంతా పెరుగుతోందని, పేదల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు వతాస్తు పలకడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులకు ప్రగతి కోసం కాకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలను కాపాడే విధంగా వారికి లక్షల కోట్లు రాయితీలను ఇస్తూ బడ్జెట్ ప్రవేశ పెడుతోందని విమర్శించారు. ఈ వ్యవస్థ మారితే తప్ప సమాజంలో సమానత్వం రాదని ఇందుకు బిజెపిని గద్దే దించడమే మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలో యుద్ద నీడలు కమ్ముకున్ని పరిస్థితులు పూర్తిగా భయానకంగా మారగా కేంద్ర ప్రభుత్వం మాత్రం తమకు ఏమి పట్టానట్లుగా తటస్థ వైఖరిని అవలభించడం మన దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. గతంలో అలీన విధానం మేరకు గత ప్రభుత్వాలు మన దేశంతో పూర్తి సఖ్యతగా ఉన్న దేశాలకు మద్దతు ఇచ్చేవన్నారు. ఇందుకు భిన్నంగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ వారు సగౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించిన గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని పేరు మార్చడమే కాకుండ ఈ పథకానికీ తూట్లు పొడుస్తూ దశవారిగా ఎత్తి వేసేందుకు కుట్ర చేస్తోందని దీనిని తిప్పికొట్టాలని పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
*దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతి ఒక్కరూ సమిక్షించుకోవాలి ః రామకృష్ణ*
కె.రామకృష్ణ మాట్లాడుతూ 77 గణతంత్రం తర్వాత నేడు ఈ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతి ఒక్కరూ సమిక్షించాలని కోరారు. ప్రపంచంలోనే ఎక్కడి లేని విధంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం గల ప్రాంతమని, ఇదే స్ఫూర్తితో రాజ్యాంగంలో పొందపర్చుకున్న లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య సూర్తిని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
*ఈటి నరసింహా మాట్లాడుతూ* కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజలందరిని మత విద్వేశాల వైపు మళ్లిస్తు అరాచక పాలనను కొనసాగిస్తోందని అగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలందరికి చెందాలిసన దేశ సంపదను కొందరి చేతులోనే పెడుతోందని విమర్శించారు. *బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ,* ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యంగా రాసుకున్న రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి చేత ఆమోదింపబడినట్లు పొందపర్చబడిందన్నారు. అధికారంలో ఎవరూ ఉన్నగాక ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
