విద్యార్థినులపై లైంగిక వేధింపులు..!

జనతా వార్ కామారెడ్డి జూలై 18

విద్యార్థినులపై లైంగిక వేధింపులు… ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల పై వేటు

.కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి చేర్చాల్సిన కొందరు ఉపాధ్యాయులే కీచకుళ్ళ మరి దారి తప్పుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడుతోంది.బాన్సువాడ మండలంలో..

ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులు కలకలం సృష్టించాయి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గోపాల్, పవన్ అనే ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విద్యార్థినుల ఆరోపణలు నిజమేనని తేలడంతో వారిద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ తెలిపారు. అలాగే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు

Latest articles

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 22 జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ...

విద్యా సంస్థల బందు విశేష స్పందన ఏఐఎస్ఎఫ్

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 10 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న విద్యాసంస్థలకు ఏఐఎస్ఎఫ్ అభినందనలు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల...

More like this

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

జనతా వార్ శేర్లింగంపల్లి జూలై 22 జూలై 24న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ...