రాజ్యాంగాన్ని కాపాడుకుందాం చలో వరంగల్

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఇంటికో మనిషి చలో వరంగల్

జనతా వార్  హైదరాబాద్ మార్చి 11

దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు

దళిత హక్కు లు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన లక్ష్యాలతో పనిచేస్తున్న దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ నిర్వహిస్తున్న 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ , ఎమ్మెల్యే (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు సహాయ కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహ, కార్యదర్శ వర్గ సభ్యులు కలవేనణి శంకర్, యం బాల్ నరసింహ మరియు సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా సీపీఐ సీనియర్ నాయకులు మేకల రవితో కలిసి లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో దళితులపై జరుగుతున్న వివక్ష, హింస ఇంకా పూర్తిగా తగ్గలేదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. దళితులకు విద్య, ఉపాధి, భూమి, సామాజిక భద్రత వంటి రంగాలలో సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

దళితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మరియు హక్కుల సాధనలో డి హెచ్ పి ఎస్ సంఘం పాత్ర చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రాబోయే డి హెచ్ పి ఎస్ 2వ రాష్ట్ర మహాసభలు దళిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృత చర్చలకు వేదిక కావాలని ఆకాంక్షించారు.

ఈ మహాసభలు ఏప్రిల్ 17, 18 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించబడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే ఏసురత్నం ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ రాష్ట్ర నాయకులు ఆరుట్ల రాజ్ కుమార్ జేరుపోతుల కుమార్ కే వెంకటస్వామి టీ రామకృష్ణ వై ఉషశ్రీ సంఘీ ఎలేందర్ యకంబరచారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మావోయిస్టు అగ్రనేతలు

జనతా వార్ హైదరాబాద్ మే 30 సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు అటవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి...

More like this