భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. దీంతో మన దేశం అంతరించి పోతుందని అంతా అనుకున్నారు.అయితే అప్పుడే చీకట్లో నుండి నిప్పుకణికలా దూసుకొచ్చాడు, భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే మరాఠా రాజ్య స్థాపకుడు, మొఘలుల దాడి నుండి సమర్థవంతగా ఎదుర్కొన్న వారు, గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన చత్రపతి శివాజీ గారి జయంతి జ్ఞాపకం !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన యోధుడు.
• చరిత్రలో రెండు పట్టాభిషేకాలు చేసుకున్న ఏకైక రాజు శివాజీ మహారాజ్ – బ్రాహ్మణుల ద్రోహం !
శివాజీ మహారాజ్ మొదటి పట్టాభిషేకం 1674 జూన్ 6న జరిగింది తరువాత రెండవ పట్టాభిషేకం కొన్ని నెలల తర్వాత 1674 సెప్టెంబర్ 24న జరిగింది.
మహారాష్ట్రలోని బ్రాహ్మణులు శివాజీని రాజుగా అభిషేకించడాన్ని వ్యతిరేకించారు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం శివాజీ శూద్రుడు. క్షత్రియులు లేదా బ్రాహ్మణుల నుండి మాత్రమే రాజుగా పట్టాభిషేకానికి అర్హులు. బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం వారు రాజుగా ఉండటానికి మాత్రమే అనుమతించబడ్డారు. గెలిచి పెద్ద రాజ్యాన్ని స్థాపించిన తర్వాత కూడా, బ్రాహ్మణులు శివాజీని రాజుగా అర్హత కలిగిన వ్యక్తిగా పరిగణించలేదు. బ్రాహ్మణులు మాత్రమే కాదు, క్షత్రియులు కూడా శివాజీని రాజుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు
శివాజీకి పట్టాభిషేకం చేయడానికి బ్రాహ్మణుడు నిరాకరించడంతో, చాలా తెగల వారు యుద్ధంలో శివాజీకి సహకరించలేదు, ఎందుకంటే అతను సాంప్రదాయకంగా పట్టాభిషేకం చేయబడిన చట్టబద్ధమైన రాజు కాదు. కాబట్టి శివాజీ 1674 జూన్ 6న పట్టాభిషేక వేడుకను నిర్వహించడానికి బెనారస్ నుండి వచ్చిన గగాభట్ అనే బ్రాహ్మణుడికి పది రెట్లు ఎక్కువ కానుకలు ఇచ్చి తీసుకు
రాదడ్డారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణ ప్రముఖుడు శివాజీ గారి నుదిటిపై బొట్టుతో అభిషేకం చేయడానికి తన చేతులతో తాకడానికి విముఖత చూపి, బదులుగా అతడు తన ఎడమ కాలి బొటనవేలును ఉపయోగించాడు. శివాజీ పూర్వీకులు మేవార్ సౌర రాజవంశం నుండి వచ్చిన క్షత్రియులని తప్పుగా ధృవీకరించడంలో గగ్గ భట్ట బ్రాహ్మనుడు ఆ పట్టాభిషేక మహోత్సవం లో పాల్గొన్నాడు. దీని కోసం శివాజీ బ్రాహ్మణుడికి పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు బంగారం మరియు బహుమతి ఇవ్వాల్సి వచ్చింది!
పట్టాభిషేకం జరిగిన 13వ రోజున శివాజీ తల్లి జిజాబాయి మరణించింది మరియు నిశ్చల్పురి గోస్వామి అనే మరో బ్రాహ్మణుడు అసలు పట్టాభిషేకం అశుభ ముహూర్తంలో జరిగిందని ప్రకటించాడమే కాకుండా, గగ్గా భట్ట బ్రాహ్మణుడు కర్మలు చేయడంలో కొన్ని తప్పులు చేశాడని తప్పు పట్టి రెండవ పట్టాభిషేకం అవసరం అని నిర్ధారించాడు. శివాజీ గారిని మళ్ళీ మోసం చేసి డబ్బు సంపాదించడానికి బ్రాహ్మణులు చేసిన అలాంటి ప్రయత్నం మాత్రమే. ఈ రెండవ పట్టాభిషేకం 1674 సెప్టెంబర్ 24న జరిగింది. బ్రాహ్మణులకు వివిధ బహుమతులు పంపిణీ చేయబడ్డాయి మరియు చరిత్రలో, ఒకే రాజుకు రెండుసార్లు పట్టాభిషేకం చేయబడ్డా రాజుగా శివాజీ గారు చరిత్రలో నిలిచారు.
మహారాష్ట్రలో శివాజీతో పోరాడటానికి మీర్జా రాజా జై సింగ్ ఢిల్లీ నుండి వచ్చి యుద్ధం ప్రకటించినప్పుడు , జై సింగ్ గెలుపు కోసం బ్రాహ్మణులు యజ్ఞం నిర్వహించారు, తద్వారా శివాజీ ఆ యుద్ధంలో ఓడిపోయారు. నేడు ఈ బ్రాహ్మణులు శివాజీ బ్రాహ్మణులకు మరియు హిందూ ధర్మానికి రక్షకుడని ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా వారిని శివాజీకి వ్యతిరేకంగా భారీ యజ్ఞం ఎందుకు చేశారని అడగాలి? శివాజీ పట్టాభిషేకాన్ని బ్రాహ్మణులు ఎందుకు వ్యతిరేకించారు అని మరీ అడవచ్చు?
భారతదేశం అంతటా శివాజీ పేరు గొప్ప యోధులలో ఒకరిగా గొప్ప గర్వంతో ప్రస్తావించబడింది, కానీ బ్రాహ్మణులకు అతడు శూద్రుడు తప్ప మరేమీ కాదు. హిందువుల విధానం, వైఖరి అప్పుడు అలాగే అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది.
(రిఫరెన్స్ – చానన్ చాహల్ రాసిన ‘ది ఈవిల్ ఆఫ్ కాస్ట్’ పేజీ 18)
తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా ఈ నాడు “హిందూ సామ్రాజ్య దివాస్” జరుపుకుంటారు. ఛత్రపతి శివాజీని “మౌంటైన్ ఎలుక” అని పిలుస్తారు. అలాగే గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీని గొప్ప యోధుడిగా కొలుస్తారు.
శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.
శివాజీ సా.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము). శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది.
షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.
• సామ్రాజ్య అంకురార్పణ….
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు.శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
• సుల్తానులతో యుద్ధాలు….
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.
1) ప్రతాప్‌ఘడ్ యుద్ధం
2) కొల్హాపూర్ యుద్ధం
3) పవన్‌ఖిండ్ యుద్ధం మొదలయినవి.
• మొఘలులతో యుద్ధాలు…
1) షైస్తా ఖాన్ తో యుద్ధం
2) సూరత్ యుద్ధం
3) సింహగఢ్ యుద్ధం
• ఆగ్రా కుట్ర….
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.
ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.
తప్పించుకున్న తర్వాత శివాజీ రాయఘర్ చేరుకున్నాడు.ఆ తర్వాత రెండు సంవత్సరముల వరకు శివాజీ మోఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు.మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు, శివాజీ ని రాజుగా గుర్తించాడు.కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచాలైనది.మొఘలు సైనాధిపతులు మహాబత్ ఖాన్, బహుదూర్ ఖాన్, దిలేవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీ పై దాడి చేశారు కానీ వారి ఎత్తులు పారలేదు.శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు.శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.
అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది
• సింహగఢ్ యుద్ధం….
శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.
తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ ‘యశ్వంతి ‘ అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.
అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ ‘కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ‘ అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు.
• శివాజీ వ్యక్తిత్వం….
సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు.
ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో “నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని” అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు.అనేక మసీద్ లు నిర్మించిన హిందూ పాలకుడు.మనువాదo అమలులో లేదు.
నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.
• పరిపాలనా విధానం…..
యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.
• సైన్యం….
మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది.పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.
• కోటలు
మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
• మతసామరస్యం…
శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు! శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే!
• చివరిదశ….
శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ ‘ఛత్రపతి ‘ అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించారు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
