నాలుగు లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాడుదాం

  1. దేశవ్యాప్త సమ్మె విజయవంతం – ప్రజల ఐక్యతకు నిదర్శనం సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

జనతావా  శేరిలింగంపల్లి ఫిబ్రవరి 12

ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన సమ్మె విజయవంతంగా జరిగింది. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటారు.

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ అంబేద్కర్ స్టాచ్ దగ్గర జరిగిన సమ్మెలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మె విజయవంతం .కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సమ్మెలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. ప్రజల విస్తృత మద్దతుతో సమ్మె విజయవంతమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భవిష్యత్తులో కూడా పోరాటాలు కొనసాగుతాయని నాయకులు హెచ్చరించారు.

ఈ సమ్మెను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు, కార్మిక సంఘాలకు, రైతు సంఘాలకు మరియు ప్రజాసంఘాల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు. శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె చందు యాదవ్ ఏఐటియుసి మండల అధ్యక్షులు తుపాకుల రాములు. డి హెచ్ పి ఎస్.ఎస్ కొండలయ్య. జెట్టి శ్రీనివాస్ మండల సహకార దర్శి. కే కృష్ణ సి ఐ టి యు. ఐ ఎ న్ టి యు. తదితరులు పాల్గొన్నారు

Latest articles

మాతా అన్నపూర్ణేశ్వరి..ll

మాతా అన్నపూర్ణేశ్వరీ.............!! 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు...

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10...

అమెరికా సుప్రీంకోర్టు సంచన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ట్రంప్‌ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం ఇప్పటి వరకు వివిధ...

More like this