చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా,స్థానిక పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు సంకల్పించారు.. ఈ మేరకు మంగళవారం చందానగర్ మున్సిపల్ కమిషనర్ శశిరేఖ గారిని కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించి,వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని పార్కుల్లో పిల్లల శారీరక వికాసానికి,ఉల్లాసానికి ప్రతి పార్కులో అత్యాధునిక ఆట వస్తువులతో కూడిన ‘చిల్డ్రన్ ప్లే ఏరియా’ను ఏర్పాటు చేయాలని యువత,వృద్ధులు మరియు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, పార్కుల్లో వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ‘ఓపెన్ జిమ్’ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు..పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు,వెలుతురు కోసం విద్యుత్ దీపాలు,కూర్చోవడానికి బెంచీలు మరియు పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలను నాటాలి తేలిపారు..
*కార్పొరేటర్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ శశిరేఖ గారు, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పార్కుల ఆధునీకరణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*
ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నేతలు మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..
