గొప్ప దేశ భక్తురాలు బినా దాస్

1986లో ఋషికేష్ పట్టణంలో గంగానది

ఒడ్డున ఒక అనాథ శవం కనిపించింది…

శరీరం కుళ్ళిపోయి ఉంది గుర్తుపట్టడానికి

చాలా శ్రమ పడ్డారు ఒక నెల రోజుల తర్వాత తేల్చగలిగారు ఆమె గొప్ప దేశభక్తురాలు

బీనాదాస్ అని…కలకత్తా విశ్వవిద్యాలయ

విద్యార్థిని దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి

అయిన బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై రివాల్వర్

ఎక్కుపెట్టి కాల్చిన ధైర్యశాలిని…బ్రిటిష్ ప్రభుత్వం బీనాదాస్ ని అరెస్ట్ చేసి‌ తొమ్మిదేళ్ళ కఠిన జైలు

శిక్ష విధించింది‌ జైలు జీవితంలో తొమ్మిదేళ్ళు

దుర్భరంగా గడపిన తర్వాత‌ ఆమె విడుదలై

వచ్చి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో

పాల్గొని మళ్ళీ అరెస్ట్ అయ్యి మరోసారి జైలు

శిక్షలు అనుభవించింది…ప్రభుత్వం ఇచ్చే

స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్

తీసుకోవడానికి నిరాకరించింది దేశసేవకు

ప్రతిఫలం తీసుకోరాదు అని మనసారా

నమ్మిన నిస్వార్థ దేశభక్తురాలు…కాలం

గడిచింది ఆమెను అందరూ మరిచిపోయారు‌

ఋషికేష్ లో అనాధగా జీవించి మరణించింది..

ఇటువంటి అజ్ఞాత దేశభక్తులు ఎందరో వారి

త్యాగాల మీద బ్రతికే ఈ నేలలో కనీసం

వారి పేరును కూడా ఏడాదికి ఒక్కసారైనా

తలవని దౌర్భాగ్యం మనది…బీనాదాస్

వంటి ఎందరో మహనీయుల ఆత్మర్పణ

ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్న

ఈ స్వాతంత్ర్యం…

జైహింద్ 🇮🇳 🇮🇳 🇮🇳

Latest articles

మాతా అన్నపూర్ణేశ్వరి..ll

మాతా అన్నపూర్ణేశ్వరీ.............!! 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం...

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా క్రాంతికుమార్ రెండోసారి ఎంపిక

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన క్రాంతి కుమార్* జనతా వార్  ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు...

హైదరాబాదులో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు ఒకేరోజు రూ.3,470 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల 10...

అమెరికా సుప్రీంకోర్టు సంచన తీర్పు

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ట్రంప్‌ టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు-సుప్రీం ఇప్పటి వరకు వివిధ...

More like this