భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థులను గెలిపించండి

ప్రశ్నించే గొంతుక సిపిఐ అభ్యర్థిని గెలిపించండి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

11వ వార్డులో CPI అభ్యర్థి నరేష్ నామినేషన్

జనతా వార్ జనవరి 30 చేర్యాల : ప్రజా సమస్యలపై పోరాడే ప్రశ్నించే గొంతుక సిపిఐ అభ్యర్థి11వ వార్డు అభ్యర్థి రామగల్ల నరేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11వ వార్డు సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు రామగళ్ళ నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత అందే అశోక్ మాట్లాడుతూ.. చేర్యాల పట్టణంలో నెలకొన్న అనేక మౌలిక సమస్యలపై ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా, చదువుకున్న వ్యక్తిగా సిపిఐ అభ్యర్థి రామగళ్ల నరేష్ గత 15సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రశ్నించే గొంతుకగా చదువుకున్న విద్యావేత్తగా ముందుకు వస్తున్నాడని సిపిఐ అభ్యర్థిగా ఆశీర్వదించి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. సిపిఐ అభ్యర్థి రామగల్ల నరేష్ మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని తిరిగి పున: ప్రారంభించాలని, డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తూ, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని, డబ్బులు, మద్యం ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్న తమను ఆశీర్వదించి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఈరి భూమయ్య,జంగిలి యాదగిరి,నంగి కనకయ్య, సుంకోజు రజిత, ముస్త్యాల కనకబాబు, భూమిగారి శివకుమార్, గోమారపు నర్సయ్య, గందమల్ల శ్రావణ్ కుమార్,సాహేద్, కల్లాటి మహాదేవులు, పుట్ట వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this