గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యాగులు పంచిన ఎమ్మెల్యే

జనతా వార్  గణతంత్ర దినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట డివిజన్ లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం*

హఫీజ్ పేట డివిజన్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన *ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ*

హఫీజ్ పేట డివిజన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *గౌతమ్ గౌడ్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, *ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు*.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎసి (PAC) చైర్మన్ మరియు శేరిలింగంపల్లి *ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి* గాంధీ గారు తన చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ* గారు మాట్లాడుతూ.. *విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు*. *గణతంత్ర దినోత్సవం వంటి పవిత్రమైన రోజున విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గౌతమ్ గౌడ్ గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు*.

కార్యక్రమ నిర్వాహకులు *గౌతమ్ గౌడ్ గారు మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో విద్యార్థుల చదువుకు తమవంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు*. తమ పిలుపును మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest articles

విద్య ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు పూర్తిగా ఉచితంగా అందించాలి

జనతా వార్ ఆగస్టు12 విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు టి నితీష్ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏ...

కాలేజీల్లో కాదు – చట్టసభలో అసలు నేరస్తులు…!

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు      –కృష్ణ కానూరి నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ...

ఎవరు ఈ.. అభిజిత్..?

నేటి సత్యం హైదరాబాద్ జూలై 26 ఎవరు ఈ అభిజీత్….⁉️ ఈ అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు....

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన…!

జనతా వార్ శేర్లింగం జులై 22 రాహుల్ గాంధీ అరెస్ట్ కీ నిరసన కార్యక్రమం.. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల...

More like this