జనతా వార్ / అక్టోబర్13
బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు గుండా మల్లేష్
కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు – కలవేన శంకర్
బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు కామ్రేడ్ గుండా మల్లేష్ అని *సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్* అన్నారు.
కామ్రేడ్ గుండా మల్లేష్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తూ, మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ, గుండా మల్లేష్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా గళమెత్తిన పోరాట యోధుడని కొనియాడారు. ప్రజా ఉద్యమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, నిరాడంబర జీవనశైలి, పోరాట స్ఫూర్తి కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శమని అన్నారు.
కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయాలను కొనసాగిస్తూ, పేద ప్రజల హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టులు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు,కలిందర్ అలీ ఖాన్,రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య , మిట్టపల్లి పౌలు,దేవి పోచన్న,చాడ మహేందర్ రెడ్డి, మొగిలి లక్ష్మణ్,
పార్టీ ప్రజాసంఘాల నాయకులు,బియ్యాల రాజేశం,మండ యాదగిరి, సిరికొండ రాయమల్లు,కొడి వేంకటేష్,అచ్చ హరిష్ తదితరులు పాల్గొన్నారు