janatawar.com
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 2:10 pm Editor : Admin

ఆయుర్వేదం తో ఆరోగ్యం

ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన.

తెలకపల్లి సెప్టెంబర్ 22 నేటి సత్యం.

మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఔషధాల వినియోగంపై మంగళవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. భాను ప్రకాష్ ఆయుర్వేద వైద్య విధానం, దాని ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులతో యోగా చేయించి, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో ఫార్మసిస్టులు దామగట్ల కుమార్, సాయిరాం, రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు.