janatawar.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:22 am Editor : Admin

ఈదులకుంట చెరువు ఎక్కడ…?

జనతా వార్ రంగారెడ్డి జిల్లా మే 19

*చెరువును చరబట్టిన వారిపై చర్యలేవి పానుగంటి పర్వతలు రాష్ట్ర సమితి సభ్యులు*

ఈరోజు రంగారెడ్డి జిల్లా జయింట్ కలెక్టర్ కిరణ్మయి ఐఏఎస్ గారిని కలిసి. శేర్లింగంపల్లి లోని కాన మెంట్ సర్వే నెంబర్ 7 లో గల ఈదులకుంట చెరువు సెల్లార్..తో వుతున్న భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. కామ్రేడ్ పర్వతాలు గారు విలేకరులతో మాట్లాడుతూ..

కూకట్పల్లి సర్వే నెంబర్ పేరుతో కానా మేట్ ఈదులకుంట చెరువులు కబ్జా చేసినా కన్స్ట్రక్షన్ యజమానిపై చర్యలు తీసుకోవాలని.

శేర్లింగంపల్లి మండలo కానమెట్టు ఈదులకుంట చెరువు కనుమరుగవుతుంది ఇంకో నాలుగు రోజులు గడిచితే చెరువు స్థలములో భౌల అంతస్తులు నిర్మాణం. చేస్తారు ఇప్పటికే చెరువును ఎన్ వి ఎస్ అనే.రియల్ ఎస్టేట్ సంస్థ ఆధీనంలోకి తీసుకొని ఈదులకుంట చెరువును చేరవేగంగా సెల్లార్ తోడిస్తున్నారు

అందులో నిర్మాణాలు చేసేందుకు సన్నదమవుతున్నారు గతంలో హైడ్ర కమీషనర్ చేరును సందర్శించి ఇది ఈధులకుంట చెరువేనని డిక్లరేషన్ చేసినారు కానీ ఇప్పుడు హైడ్రా శాఖ ఎందుకు ఈ స్థలాన్ని చెరువును విస్మరించారో తెలియదు

కానా మేటు సర్వేనెంబర్ 7లో 6. ఎకరాల 5గుంటలు ఇది ప్రభుత్వ భూమి అని నిధులకుంట చెరువు గ.. పెరుకుంటూ రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా వివరాలు ఇచ్చారు.

హైడ్రా ఏర్పాటు తర్వాత మరోసారి కబ్జానుండి కాపాడాలంటూ హైడ్రా కమీషనర్ రంగనాథ్ గారికి లిఖితపూర్వకంగా వినతి పత్రాలు సమర్పించారు ప్రజలు.

దీనిపై స్పందించిన కమిషనర్ ఈదులకుంట చెరువును మూడుసార్లు స్వయంగా సందర్శించి రెవెన్యూ ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులకు చెరువు వద్దకే పిలిపించి హద్దులను నిర్ణయించాలని ఆదేశించారు. అప్పటికి చెరువు చుట్టూ ఉన్న పెన్షన్ పరిశీలించిన ఆయన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద జెసిబిలతో సెల్లార్ కొడుతూ చెరువును కనుమరుగు చేశారు దయచేసి చెరువును కాపాడల ని కోరుతున్నాము. తక్షణమే పనులను ఆపివేయాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ తమరికి విజ్ఞప్తి

ఈ కార్యక్రమంలో. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె చందు యాదవ్. ఏఐటిసి మండల అధ్యక్షులు తుపాకుల రాములు. తదితరులు పాల్గొన్నారు