janatawar.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 12:08 pm Editor : Admin

డిహెచ్పిఎస్ రాష్ట్ర రెండో మహాసభల గోడపత్రిక విడుదల.

జనతా వార్ర్. నాగర్ కర్నూల్ ఏప్రిల్ 10 .దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర రెండవ మహాసభలను విజయవంతం చేయండి*

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ చారి భవన్లో ఈనెల *17 18 తేదీలలో వరంగల్ మహానగరంలో జరుగు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రెండవ మహాసభల* గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు తప్పేట కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్,డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మి పతి గార్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన నేటికీ కూడా దళితులకు స్వాతంత్రం రాలేదని దేశంలో బిజెపి గవర్నమెంట్ వచ్చినప్పటినుండి దళితులపై రెట్టింపు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని మనువాదాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించి ప్రజల మధ్య విద్వేషాలను రగిలించి నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దళితులపై విద్వేషపూరిత హత్యలు జరుగుతున్నాయని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించి దళితులను ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాలని అంటరానితనం, అస్పృశ్యత,కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దళితులను ఐక్యం చేసి దళిత సమస్యల నిర్మూలన కోసం, పెరిగిన దళిత జనాభా కు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, ప్రైవేటు సంస్థలలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తు పోరాట నిర్ణయాలు తీసుకోబడతాయని వారు పేర్కొన్నారు కావున జిల్లా నుండి మహాసభకు అధిక సంఖ్యలో దళితులు హాజరై మహాసభలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వంకేశ్వరం శ్రీను, జిల్లా కోశాధికారి కొత్త రామస్వామి,జిల్లా కౌన్సిల్ నాయకులు శివ కృష్ణ, సత్యం,శివశంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.