janatawar.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 3:01 pm Editor : Admin

భగత్ సింగ్ చివరి లేక…..

ఉరి తియ్యటానికి ఒక్కరోజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ (22-03-1931)

కామ్రేడ్స్!

జీవించి ఉండాలి అన్న కోరిక నాకు లేదు అని చెప్పదలుచుకోలేదు. కాని జీవించడమంటు జరిగితే శాశ్వతంగా జైలు గోడల మద్య బందనాలలో బ్రతకాలి అని నాకు లేదు.

ఈ రోజు నా పేరు హిందుస్తాన్ సోషలిస్టు విప్లవ పార్టీకి పర్యాయపదం గా తయారు అయింది. విప్లవ పార్టీ ఆశయాలు , ఉజ్వల బలిదానాలు నన్ను అత్యున్నత స్తానం లో నిలిపాయి. బహుశా నేను బ్రతికి ఉన్నా ఎప్పటికి అందుకోలేనంత ఎత్తుకి చేరుకున్నాను. ఇప్పుడు ప్రజల దృష్టి లో నేను బలహీనుడను కాదు. నేనే కనక ఉరి తప్పించుకుని బయటకు వస్తే ఆ బలహీనతలు బహిర్గతం కావచ్చు. విప్లవ కేంద్ర ప్రభావం పల్చపడవచ్చు .ముగిసిపోవచ్చు కూడా. నేను ధైర్యంగా నవ్వుతూ ఉరికంభం ఎక్కినట్టు అయితే దేశం లో తల్లులు తమ పిల్లలని భగత్ సింగ్ కావాలి అని కొరుకుంటారు . తద్వారా దేశ దాస్య విముక్తి కోసం ఆత్మార్పణ చేసే మరెందరో తయారు అవుతారు. సామ్రాజ్యా వాదం సర్వ శక్తులా పెనుగులాడినా విప్లవాన్ని అడ్డుకోలేని స్థితి వస్తుంది.

ఈ సమయం లో ఒక భావన నాలో తరచూ తలెత్తుతున్నది . దేశం కోసం, మానవాళి కోసం అనుకున్నదానిలో సగం కూడా నేరవేర్చలేకపొయాను. నేను కనక ఒక వేల బ్రతికి ఉంటే ఇవన్ని పూర్తి చేయటానికి అవకాశం లబించేదేమొ. అప్పుడు నా ఆలోచనలు ఆచరణలో పెట్టగలిగేవాడిని. ఈ ఒక్క కొరత తప్ప నా హృదయం లో ఉరి శిక్షను తప్పించుకోవాలి అని ఎలాంటి ప్రలోభము లేదు. నాకన్నా ఎక్కువ అదృష్టవంతులు ఎవరు ఉంటారు? ఇటీవల కాలం లో నన్ను చూస్తే నాకే గర్వం కలుగుతొంది. ఆకరి పరిక్ష కోసం మనస్సు ఎంతో ఆదుర్ధా గా నిరీక్షిస్తోంది. అది మరింత త్వరగా రావాలని కోరుకుంటుంది.