janatawar.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 8:44 am Editor : Admin

విద్యార్థులకు మంచినీటి సౌకర్యం

విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించిన జైపాల్ రెడ్డి

జనతా వార్ తాడూరు మార్చి 17

*నాగర్ కర్నూల్ (జిల్లా) తాడూర్ (మండలం) భల్లాన్ పల్లి (గ్రామం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలంగాణ మున్సిపల్ సంఘం (ఎఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులు, స్కూల్ పిల్లల సమక్షంలో ప్యూర్ పైడ్ వాటర్ ఫిల్టర్ (35000) రూపాయలది ఇప్పించడం జరిగింది. ఇదే గ్రామంలో చదువుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు మరువకుండా సొంత ఊరు ప్రయోజనాల కోసం. భల్లాన్ పల్లి గ్రామం లోని చదువుకొని ఈరోజు ఒక రాష్ట్ర నాయకునిగా ఎదగడం ఒక అరుదైన విషయమని అన్నారు. ఈరోజు పిల్లల సమక్షంలో ఆనందంగా ఉందని అన్నారు. స్కూలుకు ఏదైనా నా వంతు సహాయ సహకారాలు ఇకపైన కూడా అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*.