తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి *టి.రామకృష్ణ* సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
జనతా వార్. ఫిబ్రవరి 7
నేడు పత్రిక విలేకరులతో.టి.రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కీలకమైనవి. ఈ ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, నిజాయితీగా, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
మున్సిపల్ పాలనలో నీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, పేదల గృహాలు, పట్టణ పేదల జీవన సమస్యల పరిష్కారానికి సిపిఐ అభ్యర్థులు నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడే నాయకత్వాన్ని అందిస్తారు. అవినీతి రహిత పాలన, ప్రజాధనానికి రక్షణ, సామాజిక న్యాయం సిపిఐ పార్టీ ప్రధాన లక్ష్యాలు.
ప్రజా సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన నిలబడే, ప్రజల గొంతుకగా మున్సిపాలిటీల్లో పనిచేసే సిపిఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
కావున, జరగబోయే. మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి, ప్రజాపక్ష పాలనకు బలాన్ని అందించాలి. అని టి రామకృష్ణ అన్నారు.