విశిష్ట యోగిని అక్క మహదేవి
విశిష్ట యోగిని అక్క మహాదేవి –------------------------------------------ గమనిక:ఈ పోస్ట్ ప్రత్యేకించి ఆధ్యాత్మిక చింతనకలిగి పర స్త్రీలలో తల్లిని చూడగలిగే సంస్కారమున్న(జ్ఞానమున్న) వారికి మాత్రమే. *అక్క మహాదేవి:-(1)*. *వీరశైవ సాంప్రదాయంలో అక్కమహాదేవి పేరు తెలియనివారు ఉండరు.ఆమె మహా శివభక్తురాలు.వీరవిరాగిణి.తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన అల్లమప్రభువు,చెన్న బసవేశ్వరుడు మొదలైన మహనీయులచేత 'అక్కా' అని సగౌరవంగా పిలిపించుకున్న జ్ఞాని. ఆమెలో భక్తీ జ్ఞానమూ సమపాళ్ళలో కలసి వెలుగుతూ ఉండేవి.* *ఆమె ఇరవైఏళ్ళకే సమాధిలో జీవితాన్ని స్వచ్చందంగా చాలించిందని కొందరు అంటారు.ఇరవై ఐదేళ్ళకు...