janatawar.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 12:07 pm Editor : Admin

బాసర ఎస్బిఐ బ్యాంకు లో చోరీ

బాసర ఎస్బిఐ బ్యాంకులో చోరీ… రైతు జేబులో నుంచి నగదు అపహరణ

జనతా వార్ జనవరి:28

బాసర మండల దొడాపూర్ గ్రామానికి చెందిన దత్తురామ్ అనే రైతు తన చేనులో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులు చెల్లించేందుకు నగదు తీసుకునేందుకు బుధవారం బాసర ఎస్బిఐ బ్యాంకు వచ్చాడు. ముందుగా తన ఖాతా నుంచి రూ. 50,000 నగదు ఉపసంహరించుకున్నాడు. డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ తన ఖాతా నుంచి రూ. 30,000 తీసుకునేందుకు బ్యాంకులో వరసలో నిలిచాడు. ఈ సమయంలో వెనుక నుంచి బుర్కా ధరించి ఓ గుర్తు తెలియని మహిళ రైతు జేబులో ఉన్న నగదును చాకచక్యంగా తీసుకొని అక్కడి నుంచి పరారయింది. కొద్దిసేపటి తర్వాత జేబులో డబ్బులు లేవని గుర్తించిన రైతు బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించాడు. ఎస్బిఐ అధికారులు బాసర ఎస్సై కి సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న బాసర ఎస్సై నవీన్ రెడ్డి వెంటనే ఎస్బిఐ బ్యాంకు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాధ్యత రైతు దత్తు రాంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరి ఘటన మొత్తం బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.