నిజాం పరిపాలనలో పోలీస్ అధికారిగా వెంకట్రాంరెడ్డి
నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రులై, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్సే ప్రధానంగా సేవచేసి అపారమైన వారి ప్రేమాభిమానలను చూరగొన్న ప్రజాబంధువు. నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన మొదటి హిందువు పాశంవారి వెంకట రామారెడ్డి గారి వర్ధంతి జ్ఞాపకం ! రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గా ప్రసిద్దులు. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో...