యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలి — ఎమ్మెల్యే జారె*
26.01.2026 – సోమవారం
గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో స్థానిక ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు అనంతరం మాట్లాడిన ఆయన క్రీడలు యువతను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేస్తాయని చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని హితవు పలికారు
అంకంపాలెం గ్రామం అనేక ప్రభుత్వ విద్యాలయాలకు నిలయంగా ఉండడం గర్వకారణమని విద్యారంగంలో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్ గారు, మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు గారు, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి గారు, దమ్మపేట తహసిల్దార్ రామ్ నరేష్ గారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ గారు స్థానిక సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి గారు, జగ్గారం సర్పంచ్ వంకా జానకీ రాముడు గారు, ఆర్లపెంట సర్పంచ్ మడకం కుమారి గంగరాజు గారు, గండుగులపల్లి సర్పంచ్ మెచ్చు ఈదప్ప గారు, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల గారు, తిరుమలకుంట సర్పంచ్ రాజేష్ గారు, పట్వారిగూడెం ఉప సర్పంచ్ బొలిగొండ నాగేశ్వరరావు గారు, ఆర్లపెంట ఉపసర్పంచ్ కట్టం సునంద ప్రసాద్ గారు అంకంపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు వాడే వెంకటరావుగారు, ఫ్రెండ్స్ యూత్ అంకంపాలెం కమిటీ సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, మహిళలు, గ్రామ పెద్దలు, యువతి,యువకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.