వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్ తిరిగి ఎన్నిక
వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ (సిపివి) 14వ జాతీయ మహాసభలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. ఈ మహాసభలో సిపివి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 56 లక్షలకు పైగా పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 1,686 మంది ప్రతినిధులు మహాసభకు హాజరయ్యారు.